టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అరకులో పర్యటించనున్నారు. ‘రా కదలిరా’ కార్యక్రమంలో భాగంగా అరకులో బహిరంగ సభను నిర్వహించనున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు అరకులో చంద్రబాబు ఉండనున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. చంద్రబాబు సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ జనసమీకరణ చేస్తున్నాయి. డుంబ్రిగుడ మండలం అరకు గ్రామ సమీపంలో జైపూర్ జంక్షన్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి.