ఈ నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ నేపథ్యంలో ప్రతి బిఎల్ఓ సిద్ధంగా ఉండాలని పొన్నూరు తహసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ అన్నారు. శుక్రవారం తహసిల్దార్ కార్యాలయంలో బిఎల్ఓ సమావేశంలో మాట్లాడారు.
22న అన్ని పొలిటికల్ పార్టీలు నాయకుల సమక్షంలో ఓటర్ జాబితాను పబ్లిక్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అలానే ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.