అయోధ్యలో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ కార్యక్రమం కోసం లక్ష లడ్డూ ప్రసాదాలను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేసింది. నిన్న (శుక్రవారం) తిరుమల నుంచి లక్ష లడ్డూలని ప్రత్యేక వాహనంలో తిరుపతికి టీటీడీ పంపింది. నేడు ( శనివారం) కార్గో విమానంలో లక్ష లడ్డూలను టీటీడీ అయోధ్యకి పంపనున్నది. 22వ తేదీన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అయోధ్య ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేయనున్నారు.