బైకును వ్యాన్ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాపట్లకు చెందిన మద్దెల రాజేష్ బైకుపై గుంటూరుకు వస్తున్నాడు.
అదే సమయంలో ఎన్ హెచ్ 16పై వెళుతున్న వాహనం మితిమీరిన వేగంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, అవతలవైపు వెళుతున్న బైకును ఢీకొంది. ప్రమాదంలో రాజేష్ కు తీవ్రగాయాలు కాగా, రాజేష్ తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.