గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కట్రపాడు గ్రామంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష-2 వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. పెదనందిపాడు మండల మాజీ కన్వీనర్ మదమంచి వాసు, సర్పంచ్ కొమ్మినేని దుర్గాప్రసాద్, పుసులూరు ఎంపీటీసీ చెల్లి లక్ష్మి,
కట్రపాడు వైస్ సర్పంచ్ రుద్రపాటి సులోచన, మాజీ ఉపసర్పంచ్ పెద్ది రమాదేవి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.