డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి అంబేడ్కర్‌పై చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ విమర్శించారు. కాళ్ళ మండలం దొడ్డనపూడి, కాళ్ళకూరు, బొండాడ, ఎస్సీ బోస్‌కాలనీ గ్రామాల్లో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కాళ్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పేరు పెట్టుకున్న విద్యా పథకానికి గతంలో ఉన్న అంబేడ్కర్ పేరే కొనసాగించాలని డిమాండ్ చేశారు.