దళిత యువకుడ్ని ఐదేళ్లుగా జైలులో ఉంచి జగన్మోహన్ రెడ్డి పైశాచికానందాన్ని పొందుతున్నాడని మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు అన్నారు. శుక్రవారం కైకలూరులో టీడీపీ యువ నాయకుడు కొడాలి వినోద్ ఆధ్వర్యంలో కోడి కత్తిశ్రీనుకు న్యాయం చేయాలని, దళితులపై దమనకాండ ఆపాలని నిరసన కార్యక్రమం చేపట్టి తాలుకా సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ... కోడికత్తి శ్రీను కుటుంబానికి న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాడతామని హెచ్చరించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పెన్మెత్స త్రినాథరాజు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పీజేఎస్ మాల్యాద్రి, యాదవ సాధికార డైరెక్టర్ గంగుల ఏసురాజు, తెలుగు మహిళా నాయకురాలు పోలవరపు లక్ష్మీరాణి, మైనార్టీ నాయకుడు బాషీద్, ఎస్సీసెల్ నాయకులు పంతగాని సురేష్, పాముల జోసఫ్ తంబి, చాబత్తిన విజయ్, కురేళ్ళ ఇస్సాక్, పళ్లెం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.