గుంతకల్లు మండలం మల్లేనిపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్జిఎస్ క్షేత్ర స్థాయి సహాయకుడు రాజేష్ మెదడులో రక్తం గడ్డకట్టి హైదారాబాదులో చికిత్స పొందుతున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి శనివారం అక్కడి ఆసుపత్రికి వెళ్ళి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించి తనవంతుగా 50 వేలు ఆర్థిక సాయం, ప్రభుత్వం నుంచి వచ్చిన రూ. 5 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.