ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీలు ఆదివాసులకు ఎంపీ టికెట్ ను కేటాయించాలని, ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన లంబాడాలకు టికెట్ కేటాయిస్తే ప్రతాపం చూపిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే అన్ని శాఖలలో వలసవాద లంబాడాల పెత్తనంతో ఆదివాసులకు త్రీవ నష్టం జరుగుతుందని అన్నారు. ఆదివాసీలకు టికెట్లు కేటాయించకుంటే తగిన బుద్ధి చెబుతామన్నారు.