పేదల సొంత ఇంటి కల నెరవేర్చినఘనత ముఖ్యమంత్రి జగన్ దే అని పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అన్నారు.
అనకాపల్లి పట్టణంలో 82 వ వార్డు పరిధిలో గల 2వ సచివాలయంలో టిడ్కో గృహ లబ్ధిదారులకు శనివారం ఆయన చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇoటితాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నర్సింగరావు, ఆడారి శ్రీనివాసరావు, ఉగ్గిన శ్రీనివాసరావు, పలకా వాసు, దొడ్డి హరిబాబు, త్రినాథ్ పాల్గొన్నారు.