గుంటూరు నగరంలోని భవానీపురానికి చెందిన ఓ బాలిక తన తల్లితో కలిసి మిరపకాయల తొడియాలు తీయడానికి వెళుతుంటుంది. తల్లి నాగమణి బంధువుల శుభకార్యానికి వెళ్లింది.
రాత్రి అవుతున్నా బాలిక ఇంటికి రాకపోవడంతో అమ్మమ్మ ఫోన్ చేసి నాగమణికి విషయం తెలిపింది. వెంటనే నాగమణి గుంటూరు వచ్చి తాను పనిచేసే చోట విచారించినా కనిపించకపోవడంతో శనివారం నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.