ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారంలోకి వచ్చాక నదిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 01:08 PM

గోదావరిలపై వంతెన నిర్మాణ బాధ్యతలను వచ్చే టీడీపీ, జనసేన నూతన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముమ్మిడివరంలో గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తాం. రూ.45 కోట్ల వ్యయంతో గుత్తెనదీవి-గోగులంక వంతెన నిర్మిస్తాం. బాలయోగి చిరకాలవాంఛ అయిన కోనసీమ రైల్వే లైను పూర్తిచేస్తాం. నర్సాపురం- సఖినేటిపల్లి వంతెన, కోటిపల్లి, ముక్తేశ్వరం వంతెనలను పూర్తిచేస్తామని హామీ ఇస్తున్నా. కొబ్బరిదింపు, ఒలుపు కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తాం. నష్టపోయిన కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఏ విధంగా న్యాయం చేయాలో చేసి చూపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com