రాష్ట్రంలో బీసీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా అర్థవీడు మండలం మాగుటూరు గ్రామంలో ఆయన ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి బీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీని గద్దెదింపేందుకు టీడీపీ, జనసేన ఉమ్మడిగా చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీలోకి చేరారు.