కర్నూలు జిల్లా, నందికొట్కూరు వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ఆదివారం తన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. మరి కాసేపట్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. కాగా ఎమ్మెల్యే టికెట్ తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధిష్టానం చివరకు తనను విస్మరించిందని ఆర్థర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కేఎస్ఆర్ పంక్షన్ హాలులో జరిగే కార్యకర్తలు, అభిమానులు, నాయకుల సమక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఎమ్మెల్యే ఆర్థర్ వెల్లడించారు.