ఈ నెల 24, 25 తేదీలలో పుంగనూరులో జరగనున్న ఇస్తిమా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు.
అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ముస్లిం పెద్దలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీ భాష తదితరులు పాల్గొన్నారు.