ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అయోధ్య కార్యక్రమం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. ప్రస్తుతం ఏడంచెల భద్రతా వలయలో అయోధ్య ఉంది. వేలాది మంది యూపీ పోలీసులు అక్కడ మోహరించారు.
వందల సంఖ్యలో కేంద్ర బలగాలతో పాటు ప్రధాని రాక నేపథ్యంలో ప్రత్యేక సిబ్బంది మోహరించారు. ప్రతి ఒక్కరిపై కన్నేసేలా ఏఐ టెక్నాలజీతో పాటు 10 వేలకు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా అయోధ్యలో కొనసాగుతోంది.