ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చిట్వేలి మండల అభివృద్ధి అధికారి శివరామిరెడ్డి సూచించారు. మంగళవారం చిట్వేలులో ఆయన మాట్లాడుతూ మైలపల్లి, నాగవరం, తుమ్మకొండ గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పై మంగళవారం సామాజిక తనిఖీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.