ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేటినుంచి ఈ నెల 31 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. ఉదయం శ్రీకాకుళం జిల్లా పరిస్థితిపై ఇచ్ఛాపురంలో,
మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి విజయనగరంలో ఆ జిల్లాపై రివ్యూ నిర్వహిస్తారు. రోజూ 3 నుంచి 4 జిల్లాల చొప్పున పర్య టిస్తూ సమీక్ష నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.