భారత్‌లో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా ‘అయోధ్య’ మారనుందని జెఫరీస్ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, మెరుగైన రోడ్డు మార్గాలు, హోటళ్లు, తదితర సౌకర్యాలు కలిగిన అయోధ్య ఏటా 5 కోట్ల పర్యాటకుల్ని ఆకర్షించనుంది.
ప్రతి ఏటా 5 కోట్ల మంది యాత్రికులు రానున్నారని, రూ.85 వేల కోట్ల ఆదాయం రావొచ్చని సంస్థ తెలిపింది. అలాగే భక్తులు, పర్యాటకులకు సేవలందించేలా అంతర్జాతీయ టర్మినల్ అందుబాటులోకి రానుంది.