ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీలు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్వాడీల ప్రతినిధులు పేర్కొన్నారు.
జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, ఇవాళ్టినుంచి (మంగళవారం) విధుల్లోకి వెళ్తామని వారు పేర్కొన్నారు. 24న ఏపీ బంద్కు అంగన్వాడీలు పిలుపునివ్వడంతో ప్రభుత్వం మరోమారు వారిని చర్చలకు పిలిచింది. మంత్రి బొత్స ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు.