మైనింగ్ రంగాల్లో చేస్తున్న సంస్కరణలు, ఆవిష్కరణలు అన్ని రాష్ట్రాల ఆర్థిక బలోపేతానికి దోహదపడతాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు. మంగళవారం రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కుషాభౌ థాకరే ఆడిటోరియంలో జరిగిన రెండో రాష్ట్ర మైనింగ్ మంత్రుల సదస్సులో సీఎం యాదవ్ ప్రసంగించారు. ఈ సదస్సుకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో, ఖనిజ బ్లాకుల వేలంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన మధ్యప్రదేశ్‌కు సిఎం యాదవ్ సర్టిఫికేట్ కూడా అందుకున్నారు. 29 మైనింగ్ బ్లాకులను వేలం వేయడం ద్వారా రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.కేంద్ర గనుల శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జోషి సందర్శించారు.