అవినీతి కేసులో ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన ఐఏఎస్ అధికారి ప్రేమ్ సుఖ్ బిష్ణోయ్‌ను రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సిబ్బంది శాఖ సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. బిష్ణోయ్ అరెస్ట్ అయిన తేదీ (జనవరి 19) నుంచి సస్పెన్షన్ అమల్లోకి వస్తుంది. జైపూర్‌లో మత్స్య శాఖ డైరెక్టర్‌గా బిష్ణోయ్‌ని నియమించారు. చేపల వేటకు లైసెన్స్ మంజూరుకు బదులుగా లంచం తీసుకుంటుండగా గత వారం శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు.