జాతీయ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ "పర్వతమాల పరియోజన" కింద వచ్చే ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లతో 200కు పైగా ప్రాజెక్టులను గుర్తించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు. కొండ ప్రాంతాలలో పర్యాటకాన్ని సులభతరం చేయడమే కాకుండా, పట్టణ ప్రజా రవాణాలో కూడా రోప్‌వే భారీ అవకాశాలను అందిస్తుందని గడ్కరీ అన్నారు. భద్రతకు విఘాతం కలగకుండా స్వదేశీ మరియు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.