ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వసంత త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అయితే ఎమ్మెల్యే వసంత త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే వార్త వైరల్ అవుతోంది.