ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గురం కలవాలని ప్రజలు కోరుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 03:56 PM

అయోధ్య రామమందిరం ఆహ్వానం సీఎం జగన్‌కు రాలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 90 శాతం హిందువులు ఉన్న ఏపీలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ రోజున జగన్ సర్కార్ సెలవు ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక వేళ జగన్‌కు ఆహ్వానం వచ్చి ఉంటే చూపించాలని నిలదీశారు. బీజేపీ - జనసేన మధ్య పొత్తు ఉందని.. జనసేన - టీడీపీ మధ్య పొత్తు ఉందని.. అయితే మూడు పార్టీలు కలవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com