ప్రపంచంలోని టాప్-50 నగరాల జాబితాను ‘టైమ్ ఔట్’ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ముంబై నగరం పన్నెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరంగా ముంబై నిలిచింది.
న్యూయార్క్, కేప్ టౌన్, లండన్, బెర్లిన్, మ్యాడ్రిడ్ మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. నగరాల్లో లభించే ఆహారం, సాంస్కృతిక సంపద, భవన నిర్మాణ రీతులు వంటి వాటిపై ప్రజాభిప్రాయం ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు టైమ్ ఔట్ తెలిపింది.