ధర్మవరం ఇన్చార్జ్ తహసిల్దార్ యోగేశ్వరి దేవి సస్పెండ్ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 18 నెలల కిందట ధర్మవరం మండల తహసిల్దార్ గా వచ్చిన యోగేశ్వరి దేవి పై పలు ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సస్పెన్షన్ కు ఆదేశించారు. భూముల పంపిణీలో ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీ వారికి మేలు చేశారని విచారణలో తేలడంతో ఆమె పై సస్పెన్షన్ వేటుపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.