ధర్మవరం పట్టణంలో ఓట్లపై విద్యార్థులతో కలిసి ధర్మవరం ఆర్డీవో రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన ఒక ఆయుధం లాంటిదని ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి తమకి ఇష్టమైన నాయకుడిని ఎన్నుకోవచ్చునని తెలిపారు. విద్యార్థులకు తమ ఓటు హక్కు పై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.