పెదచెర్లోపల్లి మండలం పాత ముద్దపాడుకు చెందిన 40 కుటుంబాలు కనిగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరూ పని చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.