ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కి ప్రాత్యేక భద్రత సిబ్బంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2024, 01:32 PM

ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యుల భద్రత కోసం ఏపీలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం 2023కు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు చట్టం అమల్లోకి వచ్చినట్టుగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ వింగ్‌తో పాటు ముఖ్యమంత్రి భద్రత కోసం అదనంగా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గత శాససభ సమావేశాల్లో చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది.ముఖ్యమంత్రి సహా ఆయన కుటుంబ సభ్యులకు పటిష్టమైన భద్రత కల్పించేలా తీసుకువచ్చిన ఈ ఎస్ఎస్‌జీ గ్రూప్‌నకు ప్రత్యేక న్యాయ రక్షణ కూడా ఉండేలా చట్టంలో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించటంతో ఇది అమల్లోకి వచ్చినట్టు హోంశాఖ ముఖ్యకార్యదర్శి పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం భద్రతకు ఒక విభాగం ఉన్నప్పటికీ దానికి చట్టబద్ధత లేదు. ఎస్‌ఎస్‌జీ ద్వారా ముఖ్యమంత్రి, భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు భద్రత కల్పిస్తారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద, రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో ప్రయాణించేటప్పుడు, నడకలోనూ వారికి భద్రత అందిస్తారు. ఏదైనా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడూ ఈ రక్షణ ఉంటుంది. ఏపీతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ నివసిస్తున్న సీఎం కుటుంబసభ్యుల భద్రత కోసం ఎస్‌ఎస్‌జీ పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్‌ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరికీ ప్రభుత్వ ఖర్చుతో భద్రత ఏర్పాటు చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com