ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో మరోసారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైయస్ఆర్సీపీని గెలిపిస్తామని చెప్పారు. విజయవాడలోని సింగ్ నగర్లో గురువారం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం వైయస్ఆర్సీపీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంలో భాగంగానే సీట్ల మార్పు జరుగుతుందని తెలిపారు. మల్లాది విష్ణుకు మరింత ఉన్నతమైన బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లాది చట్టసభల్లోకి వెళతారన్నారు.