అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష అని, మూడు రాజధానుల విషయంలో మా స్టాండ్ మారదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు కావాల్సిన పథకాలు అందించిన నాయకులు సీఎం వైయస్ జగన్ అన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎల్లోమీడియా పని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎప్పుడైనా నెరవేర్చారా అని నిలదీశారు.