తనకి సీఎం వైయస్ జగన్ జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిళ స్పష్టంగా చెప్పాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా? అంటూ సజ్జల ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని.. ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, షర్మిల మాట్లాడిన ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టారు. రావటమే మాపై వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. ఆమెకి ఇక్కడి రాజకీయాలపై అవగాహన లేదు. వైఎస్సార్ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే. వైయస్ జగన్ కి చెల్లెలుగా, వైయస్ఆర్కి కూతురిగా మాత్రమే షర్మిళ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ వైయస్ఆర్ ఫ్యామిలీని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసు అని గుర్తు చేశారు.