ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని శాప్ నెట్ ఛైర్మన్ కృష్ణ చైతన్య కలిశారు. నిన్న కృష్ణ చైతన్య గ్రానైట్ క్వారీలో మైనింగ్ అధికారులు తనిఖీలు చేశారు. బాలినేనితో భేటీ అనంతరం కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అద్దంకిలో నాలుగు సంవత్సరాలు కష్టపడిన తరువాత నన్ను మార్చడం బాధగా ఉంది. అద్దంకి సీటు విషయంపై మరోసారి సర్వే చేయమని అడిగాను. సర్వే చేసి 15 రోజుల్లో పిలుస్తామని చెప్పారు. కానీ నన్ను మళ్లీ పిలవలేదు. సీఎం జగన్‌కి నా మీద మంచి అభిప్రాయం ఉంది. కానీ కొన్ని శక్తులు నన్ను మార్చేందుకు పని చేశాయి. అయినా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నేను చేయలేదు. ఇప్పటి వరకూ పార్టీ మారే ఆలోచన నాకు లేదు. నేను ఎవరినీ కలవలేదు. మా గ్రానైట్ క్వారీపై మైనింగ్ అధికారుల దాడి జరగడం బాధగా ఉంది. వైసీపీ పెట్టినప్పటి నుంచి మానాన్న పార్టీ కోసం పని చేశారు. అద్దంకి వైసీపీ టికెట్ నాకు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు.