తన కోసం, విదేశాల్లో ఉన్న తనబిడ్డల భద్రత కోసం అత్యంత ఖరీదైన ప్రాక్స్‌మేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న సీఎం జగన్ రెడ్డికి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలి మహాప్రభో అని వేడుకుంటున్న చెల్లెలు సునీత గుర్తు రాలేదా? అని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు నిలదీశారు. సునీత అంతలా వేడుకుంటున్నా కనీస భద్రత కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. దళితులను, బీసీ వర్గాలను దారుణంగా గొంతులు కోసి హత్య చేసి డోర్ డెలివరీ చేయిస్తున్న జగన్‌కు ఇంత రక్షణ అవసరమా ? అని కనపర్తి శ్రీనివాసరావు నిలదీశారు. సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులకు పటిష్టమైన భద్రత కల్పించేలా తీసుకువచ్చిన ఈ ఎస్ఎస్జీ గ్రూప్‌నకు ప్రత్యేక న్యాయ రక్షణ కూడా ఉండేలా చట్టంలో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించటంతో ఇది అమల్లోకి వచ్చినట్టు హోంశాఖ ముఖ్యకార్యదర్శి పేర్కొన్నారు. ఎస్ఎస్జీ ద్వారా ముఖ్యమంత్రి, భార్య/భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు భద్రత కల్పిస్తారు.