"మాఘ బహుళ చతుర్థశి రోజు వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకం. ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది. మార్చి 8 శుక్రవారం రాత్రి 8గంటల 13 నిముషాల వరకూ త్రయోదశి ఉంది.
కావున ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమైంది. మార్చి 9 శనివారం సాయంత్రం 5 గంటల 59 నిముషాల వరకూ చతుర్థశి ఉంది. అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ప్రధానం. అందుకే మహాశివరాత్రి మార్చి 8న జరుపుకోవాలి.