శ్రీశైలం దేవస్థానం ధర్మప్రచారంలో భాగంగా గురువారం పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లరేషన్ కార్డ్ కలిగిన భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత సామూహికసేవలలో భాగంగా చంద్రవతి కల్యాణ మండపంలో ఈ సామూహిక రుద్రహోమాన్ని నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పర్యవేక్షకులు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.