ఉరవకొండలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. పాత కక్షల నేపథ్యంలో టీడీపీ నాయకుడు మారెన్న అతని కుమారుడు శ్రీనివాసులపై కట్టెలు, రాళ్లతో వైసీపీ కార్యకర్తలు శ్రీకాంత్, లక్ష్మయ్య, పెన్నయ్య దాడికి పాల్పడ్డారు.దాడిలో ఇరువర్గాల కార్యకర్తలకి గాయాలు జరిగాయి. మారెన్న కారు అద్దాలను రాళ్లతో కొట్టి వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కారుకు అడ్డంగా పడుకుని మరీ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.