ఏపీలోనే మెట్రో లేకుండా చేశారు.. సౌత్ ఇండియాలో ఇది మనకి అవమానం కాదా? వైసీపీ, టీడీపీలకు 25 మంది ఎంపీలు ఉన్నారు. వారు సాధించింది మాత్రం గుండు సున్నా. బీజేపీతో దోస్తీ చేశారు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. హోదా, రాజధాని, పోలవరం సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. బీజేపీకి బానిసలుగా మారి.. ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. ఏపీ అన్ని విధాలా బాగు పడుతుంది. హోదా, పోలవరం , అభివృద్ది అన్నీ కాంగ్రెస్‌తోనే సాధ్యం. ప్రధానిగా రాహుల్ గాంధీ బాధ్యత స్వీకరించిన వెంటనే హోదాపై తొలి సంతకం చేస్తామన్నారు. ఈ 70 రోజులు కష్టపడి అందరం కలిసి పని చేద్దాం.. ప్రజలను కలుద్దాం. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే.. చరిత్ర హీనులుగా మారుతాం అని చెప్పాలి. టీడీపీ, వైసీపీ, జనసేనలకు ఓటు వేస్తే... బీజేకి ఓటు వేసినట్లే. ఆ ముగ్గురూ... బీజేపీ ఒక్కటే. బీజేపీ అంటే.. బాబు, జగన్, పవన్ అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లండి’’ అని షర్మిల పిలుపునిచ్చారు.