ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను యథావిధిగా ప్రజలకు అందిస్తామని.. సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదన్నారు. సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానాకి తమకు ఏ సంబంధం లేదని ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తమ అసోసియేషన్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,150 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయని వాటిల్లో సేవలు నిరంతరాయంగా అందుతాయని చెప్పారు.
ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రొసీజర్‌లను భారీగా పెంచడమే కాకుండా, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను గురువారం నుంచి యాజమాన్యాలు నిలిపివేయనున్నట్లు ప్రచారం జరిగింది. బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు మాత్రం బకాయిలను చెల్లించడకపోవడంతోనే సేవలు నిలిపివేసినట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో వారు స్పందించి క్లారిటీ ఇచ్చారు. బకాయిలతో పాటుగా ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 25నుంచే సేవలు నిలిపేస్తామని గతంలో ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. అప్పట్లో దీనిపై యాజమాన్యాలతో చర్చించింది. ఆ తర్వాత ఆస్పత్రులు సేవల్ని కొనసాగించిన సంగతి తెలిసిందే.