లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని గతంలోనే ఆ పార్టీ ప్రకటించింది. మేము హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. లోక్‌సభకు సంబంధించి, మేము బలంగా ఉన్నామని, ఎన్నికల్లో కూటమిగా మరియు స్వతంత్రంగా కూడా పోటీ చేయవచ్చని మా వైఖరిని మా పార్టీ జాతీయ నాయకత్వానికి తెలియజేశాము. పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుంది అని సుశీల్ గుప్తా తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు 13 సీట్లు (పంజాబ్‌లో) వస్తాయని మీడియా సమావేశంలో మన్ అన్నారు.