కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 28న పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురిలో పునఃప్రారంభం కానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు రోజుల విరామం తర్వాత యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం ప్రకటించారు.
మణిపూర్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహార్ లలో 12 రోజుల పాటు సాగిన రాహుల్ యాత్రను ఈ నెల 25 మధ్యాహ్నం నుంచి రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విరామం తర్వాత జల్పైగురిలో యాత్ర ప్రారంభం కాగా, సిలిగురిలో బహిరంగ సభ నిర్వహించి ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని సోనాపూర్లో బస చేస్తారు.