కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ(ఆప్) నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనను అరెస్ట్ చేస్తామని తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బెదిరిస్తున్నారన్నారు.