ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదన్నారు మంత్రి ఆర్కే రోజా. తమతో ఉంటున్నదెవరో.. తమ సమస్యల కోసం పోరాడిందెవరు.. అధికారంలోకి వచ్చాక పరిష్కరించిందెవరో ప్రజలకు తెలుసు. ఇచ్చిన హమీలు నెరవేర్చిన నేతలు వైఎస్సార్, వైఎస్ జగన్ అని రోజా పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే ఓటు.. ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్య ఉంటున్న ప్రజా నాయకుడు జగనన్న’’ అని ఆమె కొనియాడారు.