ఈ నెల 31న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళగిరిలోని వైయస్సార్ విగ్రహం వద్ద నుంచి ముందుగా పాదయాత్ర ప్రారంభమై లక్ష్మీ నరసింహ స్వామి గోపురం మీదుగా మిద్దే సెంటర్ వరకు సాగుతుందని వైసీపీ నాయకులు చెప్పారు.ఈ సమావేశానికి రాష్ట్రంలోని బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీలకు చెందిన నాయకులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు... ఈ నియోజకవర్గంలో మొదలు పెడుతున్న మొదటి కార్యక్రమం కావున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక్కడ నుండి టిడిపి నాయకుడు లోకేశ్ ఇక్కడ పోటి చేస్తున్నాడు...గతంలో ఓటమి చెందాడు కాబట్టే.కుమారుడు లోకేష్ ను గెలిపించేందుకు చంద్రబాబు నాయుడు సతవిధాలుగా ప్రయత్నాలు చేస్తాడని, ఈ నియోజకవర్గ ఏం చేయడానికి అయినా వెనకడుగు వేయాడని, ప్రజలు మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తాడని అన్నారు.. చెయ్యగలిగినది, చేయలేని హామీలను కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు.అలాగే నియోజకవర్గంలో కుట్రలు చేసే అవకాశం లేకపోలేదన్నారు..వాటన్నిటినీ మనం అధిగమించాల్సి ఉందన్నారు.. తెలుగుదేశం పార్టీకి దీటుగా సమాధానం చెప్పేందుకు మొదటిగా సాధికార బస్సు యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పారు.