రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ... దేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా, ఎటువంటి దుష్ట శక్తులు, శత్రువులు ఎవరూ ఏమీ చేయలేని విధంగా మన రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు జరుగుతోంది. ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడాలన్న విధానానికి ప్రాతిపదికగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మన రాజ్యాంగం వల్ల స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల జరుగుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి. మన పక్క దేశం పాకిస్తాన్తో పోల్చి చూస్తే మన రాజ్యాంగం గొప్పదనం ఎటువంటిదో అర్థమవుతుంది. మన దేశంలో ఉన్నంత పటిష్టంగా రాజ్యాంగం పాకిస్తాన్‌లో లేదు అని అన్నారు.