విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సీఎం జగన్ నిర్ధాక్షిణ్యంగా కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు పేర్కొన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా సహకరించిన వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే విశాఖను పరిపాలన రాజధాని అన్నారని వాసు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రవాసులను నట్టేట ముంచిన జగన్.. సిద్ధం పేరుతో భీమిలిలో ఎన్నికల సభను నిర్వహించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో రుషికొండలో అక్రమంగా భవనాలు నిర్మించారన్నారు. నిర్మించిన భవనాలకు ముందుగా జగన్ తన సొంత డబ్బులను ప్రభుత్వ ఖజానాకు చెల్లించిన తర్వాతే విశాఖలో అడుగు పెట్టాలని వాసు అన్నారు.