బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్కు అందజేశారు. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మరోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, గత ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.