రాష్ట్ర భవి ష్యత్తును అంధకారంలోకి నెట్టి అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగనను, వైకాపాని ఇంటికి పంపించడానికే జనాలే సిద్ధంగా ఉన్నారని తెదేపా ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వర రావు తెలిపారు.
అచ్చుతాపురంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఒక్కసారి ఓటు వేసినందుకే రక్తకన్నీరు మిగిల్చారని, మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. మధ్యం నిషేధం పేరుతో ఆడపడుచులను, 75శాతం స్థానికులకు ఉపాధి అంటూ యువతను మభ్యపెట్టారన్నారు.