ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ నౌక, రాయల్ కరీబియన్ సంస్థకు చెందిన ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ తన తొలి ప్రయాణానికి సిద్ధమైంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం
మయామీ పోర్టు నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం బయలుదేరి వారం రోజులపాటు సముద్ర జలాలపై విహరిస్తూ వివిధ దీవులను చుట్టేయనుంది. ఈ ఓడకు 2,350 మంది సిబ్బంది, 7,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది.